
ప్రతి మనిషికి 250 రోజులకు పని దినాలు కల్పించాలని ఉపాధి కూలీలకు రోజువారి కూలీ రూ.600 తగ్గకుండా కూలి ఇవ్వాలని, ప్రతి వారం కూలి డబ్బులు చెల్లించాలని, పని ప్రదేశంలో టెంట్, నీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచాలని ఎఐపికెఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయి గౌడ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం డిచ్ పల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలతో ఎఐపికెఎంఎస్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయ గౌడ్ మాట్లాడుతూ కొలతలు లేకుండా ప్రతి కూలికి రూ.600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజువారి కూలీ రూ.300కు తగ్గకుండా కూలి ఇస్తున్నామని ప్రకటించడమే తప్ప, ఎక్కడ రూ.300 కూలీ ఇచ్చిన దాఖలు లేవన్నారు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు కూలీలు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 250 రోజుల పని దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ మండల కార్యదర్శి మురళి,పివైఎల్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా ఎఐపికెఎంఎస్ జిల్లా నాయకులు మోహన్, మమత, బాలమణి, సుజాత, సాయిలు, విఠల్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.