నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఎర్రగడ్డ రజక వృత్తిదారులకు 250 యూనిట్లకు ఉచిత కరెంటు ఇవ్వాలని, ఒకవేళ బిల్లు ఇస్తే దానిని వెంటనే మాఫీ చేయాలని శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సు ల్తాన్‌నగర్ రజక వృత్తిదారుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు రాపర్తి అశోక్ మాట్లాడుతూ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రజక వృత్తిదారులందరి కరెంట్ బిల్లు లు వెంటనే మాఫీ చేయాలని, 250 యూనిట్ల ఫ్రీ కరెంటు గత ప్రభుత్వం రజకులకు ఇచ్చిందని, ఇప్పుడు ఈ ప్ర భుత్వం వచ్చి మూడు నెలలు దాటిన కరెంటు బిల్లులు మాఫీ చేయకపోగా కరెం ట్ బిల్లులు కట్టాలని ఎలక్ట్రిక్ లైన్‌మేన్‌లు, ఏఈలు ఒత్తిడి చేస్తున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రజకుల పెండింగ్ బిల్లులు మాఫీకి ఫండ్ రిలీజ్ చేసి మాఫీ చేయాలని తెలంగాణ రజక వత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తుంది. లేని యెడల రజక వత్తిదారులందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. అదే విధంగా రజకులకు రక్షణ చట్టం చేయాలని, ప్రతి రజకునికి రజకబంధు కింద రూ.10 లక్షలు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల ఇవ్వాలని, రజకులకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయా లని, ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి, శ్రీనివాసు, గోపాల్, యాదగిరి, స్వా మి, రమేష్, ఆనంద్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.