నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ ఎస్ ఆర్ రమేష్, సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరినారు. బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ గా భారీ మెజారిటీ తో గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు , చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి పలువురిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం అంబికా లింగం, ఆర్మూర్ నియోజక వర్గం నుండి గడ్డం ప్రభాకర్,మహిళ నాయకులు బిందు, రాషిద, తదితరులు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, రేంజర్ల సురేష్, అంబిక సత్యనారాయణ, బొబ్బ నరసింహ, కల్లెడ గంగాధర్, గడ్డం ప్రభాకర్, చిలుక సత్యనారాయణ, అంబిక లింగం, శంకర్ ముదిరాజ్, లవంగ రాజు, పసుల రాజు, అర్సపల్లి అశోక్, పురుషోత్తం, గంగోని రాజేశ్వర్, పోశెట్టి, అక్తర్ బేగం, రమేష్, బిందు, రమ్య, రషీద బేగం, దేవి బాబు, అజీసుద్దీన్, రమణ, తదితరులు పాల్గొన్నారు.