27 నుంచి అర్థసంవత్సరం పరీక్షలు : టీజీపీఎస్సీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అర్థసంవత్సరం పరీక్షలు, ఆలిండియా సర్వీసెస్‌, స్టేట్‌ సర్వీసెస్‌ అధికారులకు లాంగ్వేజ్‌ టెస్ట్‌, రాష్ట్రంలో పనిచేస్తున్న ఆలిండియా అధికారులకు ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ను ఈనెల 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు ఈనెల 16 వరకు గడువుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.