270 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు
నవ తెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ నగర శివారులో కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ కల్మేశ్వర్ సంగావర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు, టాస్క్ ఫోర్స్ సీఐ అజయ్, అంజయ్య కంటేస్వర్ బైపాస్ ప్రాంతంలో తనిఖీలు ఆదివారం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రాజస్థాన్ కు చెందిన RJ 11 GC 9771 నంబర్ గల కంటైనర్ లారీలో హైద్రాబాద్ నుండి మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 270 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారణ నిమిత్తం రూరల్ పోలీసులకు అప్పజేప్పారు. రేషన్ బియ్యం విలువ లక్షల్లో ఉంటుందని అక్రమంగా తరలిస్తున్న నిర్వాహకులు లారీ డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ ను విచారించగా పేర్లపై కేసులో నమోదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్  తెలిపారు.