
మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్లమల్ల గిరి ప్రసాద్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి విప్లవ జోహార్లతో నివాళులర్పించారు. అనంతరం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేష్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా కామ్రేడ్ సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ గిరి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ భారతమ్మ, ఉడుత మైసయ్య, ఏడుజెర్ల సాయిలు ,మురళి, తదితరు నాయకులు పాల్గొన్నారు.