హైదరాబాద్: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఇంటెగ్రా ఎస్సెన్సియా లిమిటెడ్ (ఐఇఎల్)కుచెందిన అగ్రో అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ బిజినెస్ సెగ్మెంట్‌కు రూ.28 కోట్ల ఆర్డర్ దక్కినట్టు ఆ సంస్థ తెలిపింది. తన రెగ్యూలర్ కస్టమర్ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్, సర్వేశ్వర్ ఓవర్‌సీస్ లిమిటెడ్ నుంచి కొత్త ఆర్డర్ పొందినట్టు పేర్కొంది. ఈ సంస్థ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 250 శాతం వృద్థితో రూ.5.91 కోట్ల నికర లాభాలు ప్రకటించింది.