రాజన్న ఆలయంలో 28 మంది ఉద్యోగులు బదిలీలు..

28 employees transferred in Rajanna temple..– ఫలించని ఉద్యోగుల పైరవీలు..
నవతెలంగాణ – వేములవాడ 
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ లో28 మంది ఉద్యోగులు బదిలీలు అయినట్లు మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ వెల్లడించింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. రాష్ట్రవ్యాప్త సీనియార్టీలో భాగంగా అదనంగా మరో ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేశారు.   ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సూపరిండెంట్ గోలి శ్రీనివాస్ తో పాటు దేవస్థానంలో ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఇద్దరు ఏఈవో లు, ఏడుగురు పర్యవేక్షకులు ,8 మంది సీనియర్ అసిస్టెంట్లు , 10 మంది జూనియర్ అసిస్టెంట్లు , 1 డిఈ తో కలిపి మొత్తం 28 మంది బదిలీ అయ్యారు.  ఉద్యోగులు యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం ఆలయాలకు బదిలీ చేసారు. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో బాధ్యతలు చేపట్టాలని  బదిలీ ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో బదిలీలు జరుగుతున్న కోణంలో దేవదాయ శాఖ అధికారులు వేములవాడ దేవాలయం నుండి 28 మంది ఉద్యోగులను రాష్ట్రంలోని భద్రాచలం, యాదగిరిగుట్ట, కొమరవెల్లి, కొండగట్టు, బాసర దేవాలయ కు బదిలీలు చేశారు. కొంతమంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు తారస్థాయిలో ఉండడం, విధి నిర్వహణలో అలసత్వం, భక్తులపై చీదరింపులు, కోపతాపాలు ప్రదర్శించడం, ఉద్యోగులందరూ స్థానికులు కావడం రెండు దశాబ్దాల కాలంగా బదిలీలు లేకుండా స్థిరంగా రాజన్న దేవాలయంలో పనిచేయడంతో అవినీతి ఆరోపణలు, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులపై “నవ తెలంగాణ” ఎన్నో ప్రత్యేక కథనాలను ప్రచురించింది.ఉద్యోగులు బదిలీ కావడంతో వేములవాడ పట్టణ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.