
డిచ్ పల్లి మండల కేంద్రంతోపాటు,ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలు, తెలంగాణ యూనివర్సిటీ లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్. భ్రమరాంబిక అధ్యక్షతన, గిరిజన సంఘాల అద్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి పాల్గొని మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔన్నత్యంతోపాటు విశ్వ మానవ అభివృద్ధికి పాల్పడ్డారన్నారు.సేవాలాల్ మహారాజ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యాటించి బంజారా జాతిని చైతన్య పరిచినారన్నారు.నీతి, నిజాయితీగా బ్రతకడం మద్యపానానికి,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జీవితాంతం పోరాటం చేశారని,విద్యార్థిని విద్యార్థులు,స్కాలర్స్ సేవాలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ ఆదర్శాలను కొనసాగిస్తూ గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువులపై దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి, ఆంజనేయులు, ఆచార్య రాంబాబు, కైసర్ మహమ్మద్, డాక్టర్ నీలిమ, డాక్టర్. పున్నయ్య, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ ప్రవీణ్, ఎం శ్రీనివాస్ రాథోడ్, బోనోత్ లక్ష్మణ్, కాంటాక్ట్ అధ్యాపకులు, గిరిజన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.