29 నుంచి యుఏఈలో..

In UAE from 29– అండర్‌-19 ఏసీసీ ఆసియా కప్‌
దుబాయ్ : అండర్‌-19 ఆసియా కప్‌ ఈ నెల 29 నుంచి యుఏఈ వేదికగా జరుగనుందని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) శుక్రవారం వెల్లడించింది. షార్జా, దుబాయ్ లో మ్యాచులు జరుగనుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌తో అఫ్గనిస్థాన్‌ తలపడనుంది. తర్వాతి రోజు దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ ఢకొీట్టనున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా నేపాల్‌, జపాన్‌, యుఏఈలు ఈ టోర్నీలో పోటీపడు తున్నాయి. గ్రూప్‌ దశలో నాలుగేసి జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో ఢకొీట్టనున్నాయి. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి. డిసెంబర్‌ 8న దుబారులో టైటిల్‌ పోరు షెడ్యూల్‌ చేశారు.