ఋణమాఫీ లబ్ధిదారులు 298 మంది: మండల లీడ్ బ్యాంక్ మేనేజర్ టి.క్రిష్ణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎస్.బిఐ స్కేల్ త్రీ అశ్వారావుపేట బ్రాంచ్ లో 298 మందిని ఋణ మాఫీ కి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది అని అశ్వారావుపేట మండల లీడ్ బ్యాంక్ మేనేజర్ టి.క్రిష్ణ తెలిపారు. ఆయన బుధవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ ఈ బ్రాంచ్ లో ఇప్పటి వరకు 79 మంది లబ్ధిదారులకు రూ.45 లక్షల 93 వేల 117 లు జమ అయినట్లు తెలిపారు. లబ్ధిదారులకు సమాచారం ఇచ్చి ఋణ మాఫీ విషయం అయి వివరించడం జరుగుతుందని తెలిపారు.