
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో శనివారం కామ్రేడ్ శావులం సాయిలు 29వ వర్ధంతి వేడుకలను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత నాయకులు ఘనంగా నిర్వహించారు. సాయిలు నీరుపేద ప్రజల కు అండగా నిలిచి సింగూర్, నిజాంసాగర్ నీటి అవసరం కోసం అనేక పోరాటాలను చేసి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పించారని వారు కొనియాడారు. మల్లెపాడు భూములను నిరుపేదలకు పంచడంలోనూ, వ్యవసాయ విత్తనాలను సబ్సిడీపై ఇప్పించడంలోనూ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని వారన్నారు. ఆయన మరణించి 29 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన అడుగుజాడల్లో తాము నిరుపేదలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న, ఎస్కే నసీర్, వడ్డెన్న, పెద్దులు, గోపాల్, సిద్ధ పోశెట్టి, తరుణ్, లక్ష్మణ్, సాయిలు, పోశెట్టి, గోరె పాషా తదితరులు పాల్గొన్నారు…