
మందకృష్ణ మాదిగ 58 పుట్టినరోజు వేడుకలు ఎమ్మార్పీఎస్ పార్టీ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని పసర ఎస్సీ కాలనీలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మడిపల్లి శ్యాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 58వ పుట్టినరోజు వేడుకలను కూడా ఈ సందర్భంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్ర సతీష్ జెండా ఆవిష్కరించారు. తర్వాత మందకృష్ణ 58వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుర్రి సతీష్ మాట్లాడుతూ మానవత్వం సమాజహితమే ఎమ్మార్పీఎస్ ఉద్యమ గమ్యం అని అన్నారు. గత 29 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అండగా నిలిచిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ సాధన కోసం దృడ సంకల్పంతో పోరాడుదాం. గత 29 ఏళ్లుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ది అన్నారు. పాలకుల కుట్రలను చేదిస్తు, ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 29 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని అన్నారు.75 యేండ్ల స్వతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు.
ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎమ్మార్పీఎస్ అందించిందని అన్నారు.అలాగే మానవతా దృక్పథంతో గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, హత్యలకు అత్యాచారాలకు గురైన మహిళల కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు.ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని అన్నారు.మాదిగల కోసమే పోరాటం ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని అన్నారు.సమాజంలో నెలకొని ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి సాంఘిక సమానత్వం సాధించడమే ఎమ్మార్పీఎస్ ఉద్యమ గమ్యమని, సమాజహితం కోసం పునరంకితం అవుతామని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు ములుగు జిల్లా సీనియర్ నేత తాడువాయి మండలం ఇన్చార్జి గజ్జల ప్రసాద్ మాదిగమండల నాయకులు ఎంఎస్ యాఫ్ ములుగు జిల్లా నాయకులు పేరాల బలరాం మాదిగ, ఎనగందుల మొగిలి మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు తోకల రాంబాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు తిక్క.దుర్గారావు మాదిగ, పంగ శ్రీను మాదిగ, నీలాల మల్లేష్ మాదిగ, చుంచు యాకోబు మాదిగ, గడ్డం సారయ్య మాదిగ, భద్రయ్య మాదిగ, వెంకటేష్ మాదిగ, మునిగల సాంబయ్య మాదిగ, పసుల సాంబయ్య మాదిగ, అంబాల అనిల్, కొంగరి సది మాదిగ, ముంజల బిక్షపతి, మాదిగ కోతి, సుధాకర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.