ఫోక్ గ్రూప్ డ్యాన్స్ లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం..

Second position in the state in folk group dance..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రస్థాయిలో జరిగిన యువజనోత్సవాలలో ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులు, ఫోక్ గ్రూప్ డాన్స్ లో రాష్ట్రస్థాయిలో  ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో వారికి పుష్పగుచ్ఛం అందించారు. ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం, వైస్ ప్రిసిపాల్ రఘు గణపతి, సూపెర్డెంట్ కరుణాకర్ కొరియోగ్రాఫర్ దత్తు విద్యార్థులని అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది  గోపాల్, స్వప్న, అనిత, సంతోషిని, భువన పాల్గొన్నారు.