టిసిఎస్‌లో 3.5 లక్షల మందికి ఎఐలో శిక్షణ

ముంబయి : కృత్రిమ మేధా (ఎఐ)కి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఐటి కంపెనీలు ఆ విభాగంపై ప్రధాన దృష్టిని పెడుతున్నాయి. తమ ఉద్యోగులను ఆ విధంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఇప్పటివరకు జనరేటివ్‌ ఎఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తొలుత పేర్కొంది. ఇప్పటివరకు 3.5 లక్షల మందికి జనరేటివ్‌ ఎఐ విభాగంలో నిపుణులుగా మార్చడానికి కృషి చేసినట్లు తెలిపింది.