నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆయుషి పటేల్ మీడియాతో ముచ్చటించారు.
– ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్ర పై ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుంది.
– దర్శకుడు రమాకాంత్ రెడ్డి రెండు గంటలకు పైగా నాకు కథను నెరేట్ చేశారు. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంది. కథ ఏం చెప్పారో..
అదే తీశారు. ఆర్‌ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది. ఈ సినిమా కోసం కడపలో షూటింగ్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నిర్మాతలు చూసుకున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపనపడుతుంటారు.
– హీరో విశ్వ కార్తికేయ ఎంతో సహకరించారు. ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారు. మా సినిమా టీజర్, ట్రైలర్ గురించి చెబుతున్నారు. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా నా గురించి, నా ఫస్ట్ సినిమా గురించి గొప్పగా మాట్లాడు కుంటున్నారు.
– ఈ సినిమా రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు.