తాడిచెర్లలో 3 రోజుల ఉచిత యోగ,ధ్యాన శిక్షణ..

– ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల లో తేదీ 28,29, 30 న శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ద్యానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఉచిత యోగ. ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని హనుమాన్ టెంపుల్ సమీపంలోని గుమ్మడి రవీందర్ గృహంలో ఉచితంగా ప్రతి రోజూ సాయంత్రం 6-00గంటల నుండి 7-30 ని  వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇట్టి యోగ, ధ్యానం పై ఆసక్తి కలిగిన వారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.