• బెజ్జంకి పట్టణాధ్యక్షుడు లింగాల బాబు
• ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరు
నవతెలంగాణ-బెజ్జంకి
జిల్లా కేంద్రంలో 3న తలపెట్టిన ధర్మ యుద్ధ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హజరవుతున్నారని బెజ్జంకి పట్టణాధ్యక్షుడు లింగాల బాబు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి బాబు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హజరై ధర్మ యుద్ధ సన్నాహక సభను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతకింది పర్శరాములు, అంబేడ్కర్ సంఘం సీనియర్ నాయకులు తాడిచెట్టు భూమయ్య, అంబేడ్కర్ సంఘం పట్టణాధ్యక్షుడు కొత్త రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.