ప్రభాస్ అభిమానులకు హోంబులే ఫిల్మ్స్ సంస్థ ఓ అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చింది. తమ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో ఏకంగా 3 ప్రాజెక్ట్‌లు చేసేందుకు ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వీటిల్లో ‘సలార్ పార్ట్ 2’తో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లు బ్యాక్ టు బ్యాక్ రానున్నాయి. ‘కేజీఎఫ్1’, ‘కేజీఎఫ్2’ ‘కాంతార’, ‘సలార్ 1’ వంటి అద్భుత విజయాలను సాధించిన చిత్రాలను హోంబులే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రాల నిర్మాణంలో దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఈ సంస్థ కేరాఫ్‌గా నిలిచింది. ప్రభాస్‌తో చేయబోయే సినిమాలతో పాటు ‘కాంతార 2’, ‘కేజీఎఫ్ చాప్టర్ 3’లను కూడా భారీ స్థాయిలో నిర్మించనుంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్2’తో పాటు ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హోంబులే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజరు కిరగందూర్ మాట్లాడుతూ,’సరిహద్దులను దాటే పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌ని మేము విశ్వసిస్తాం. ప్రభాస్‌తో మా కొలాబిరేషన్ రాబోయే తరాలకు స్ఫూర్తి. వినోదాన్ని పంచే టైమ్‌లెస్ సినిమాలని రూపొందించే దిశగా ప్రభాస్‌తో మేం ఒక అడుగు ముందుకేస్తున్నాం’ అని తెలిపారు.