హైదరాబాద్ : తమ సంస్థకు భారత ప్రభుత్వం నుంచి 3 స్టార్ ఎక్స్‌పోర్ట్ హౌస్ సర్టిఫికేషన్ లభించిందని లామినేట్, ఎమ్‌డిఎఫ్ ప్యానెల్ బోర్డుల తయారీదారు రుషిల్‌డెకోర్ తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తమ విజయానికి ఇది గుర్తింపు అని పేర్కొంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు గుర్తింపు తమ విశ్వసనీయతను పెంచుతుందని రుషిల్ డెకర్ లిమిటెడ్ డైరెక్టర్ రుషీల్ ఠక్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాము 51 పైగా దేశాలకు ఎగుమతులు చేస్తున్నామన్నారు.