
తెలంగాణ నవనిర్మాన్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నీ సోమవారం కలిసి వినతి పత్రం అందజేసినట్టు విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ తెలిపారు. ఈనెల 23 తారీకు నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించవలసిందిగా రాష్ట్ర విద్యార్థుల పక్షాన అసెంబ్లీలో గొంతు ఎత్తి నిలదించవలసిందిగా విద్యార్థి సేన నాయకులు కోరినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలనే విద్యా వ్యవస్థ అందులో సక్రమంగా నడుస్తుందా లేదా అనే అంశం నీ పట్టించుకోని నాధుడు లేడు అని పై విశాలపై అసెంబ్లీలో గల మెత్తవలసిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దిలీప్ అరవింద్ కుల్దీప్ సింగ్ రాము తదితర నాయకులు పాల్గొన్నారు.