మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పొట్టి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం నగరంలోని బోర్గం చౌరస్తాలో ఎం ఆర్ పి ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ నాగభూషణం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి నాగభూషణం మాదిగ మాట్లాడుతూ.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం వచ్చినా వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేస్తుర్రు తప్ప ఇప్పటివరకు మాదిగ జాతి కొరకు సానుకూలంగా లేదు. ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మోడీ వర్గీకరణ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది, కాని మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవాలని మాదిగలకు న్యాయం చేయాలని కేంద్రంలో బిల్లు పెట్టి మాదిగలకు సమానమైన వాటా అందించాలని బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అయినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్న అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకోపోకుండా మాదిగల పక్షాన మాట్లాడడం లేదు అని ఆవేదన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు రాష్ట్ర అభివృద్ధి కొరకై మోడీ ని కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడుతుండే తప్ప ఏబిసిడి వర్గీకరణ పైన మాదిగల పక్షాన కనీసం మాట్లాడడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రం నుండి మాదిగల పక్షాన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తా ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే మాదిగల పక్షాన మాట్లాడి బిల్లు పెట్టాలని బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేసే విధంగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేందర్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు సంగం కిష్టయ్య మాదిగ, జిల్లా పట్టణ అధ్యక్షులు శివ మాదిగ, రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి దీపక్ మాదిగ, గ్రామం బోర్గాం అధ్యక్షులు మనోహర్ మాదిగ, ప్రభాకర్ మాదిగ బాల నరసయ్య మాదిగ, మహేష్ మాదిగ, శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.