నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సీపీఐ(ఎం) స్టార్ క్యాంపేయి నర్లుగా 31 మందిని ఆ పార్టీ ప్రకటిం చింది. పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, సుభాషిణి అలీ, రాఘవులు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, విజ్జూకృష్ణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య,చెరుపల్లి సీతా రాములు, జూలకంటి రంగారెడ్డితో పాటు మొత్తం 31 మంది పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటారని తెలిపింది.