317 జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలి

– గవర్నర్‌కు తపస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని తపస్‌ కోరింది. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆ సంఘం డైరీని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు తపస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్‌ సురేష్‌ వినతిపత్రం సమర్పించారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం ప్రతినిధి సూరం విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అయిల్నేని నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.