– మహిళా కాంగ్రెస్ ధర్నా…ఉద్రిక్తత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ పిలుపుమేరకు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిం చారు. బారీకేడ్లు ఎక్కి దూకేందుకు యత్నించారు.మహిళలను పోలీసులు అడ్డుకు న్నారు. పోలీసు లకు, మహిళలకు వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని కోరారు.