– యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవస్థానం 35 రోజులకు గాను 3 కోట్ల 93 లక్షల 88 వేల 92 రూపాయల ఆదాయం వచ్చిందని యాదాద్రి దేవాలయ ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. మంగళవారం 35 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాలయంలో నిర్వహించారు. 174 గ్రాములు బంగారం , 7 కిలోల వెండి రాగా, దేవాలయానికి విదేశీ మారక ద్రవ్యం కూడా వచ్చింది . వాటి వివరాలు అమెరికా – 1359 డాలర్లు, ఆస్ట్రేలియా 25 డాలర్లు, ఇంగ్లాండ్ – 55 పౌండ్స్, యూఏఈ – 65 దిరమ్స్, మలేసియా – 1 రింగిట్స్, యూరోప్. 20 యూరో, నేపాల్ – 10 రుపిస్ , కెనడా – 30 డాలర్స్ , సౌదీ అరేబియన్ 66 రియల్, సింగపూర్ 50 డాలర్స్, స్కాట్లాండ్ 5 పౌండ్, మాల్దీవ్స్ 10 రుఫీయ, మాళవి 2000 క్వచ , మయన్మార్ 100 క్యాట్ , కువైట్ 2 దినర్ , కతర్ 1 రియల్ , థాయ్ 20 భాట్ ,మలేసియా 1 రైంగిట్, బంగ్లాదేశ్ 10 టాకా ల ఆదాయం వచ్చిందని తెలిపారు. కాగా అమెరికా దేశం నుంచి అత్యధికంగా 1359 డాలర్ల రూపాయలు వచ్చింది.