వేర్వేరు చోట్ల చిక్కుకున్న 35 మంది..

35 people trapped in different places..

– రంగంలోకి ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం…

– రక్షణ చర్యలను పర్యవేక్షించిన ఎస్పీ రోహిత్ రాజు,అశ్వారావుపేట,పోలవరం ఎమ్మెల్యేలు..‌
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో నారాయణపురం – బచ్చువారిగూడెం మధ్యలో గల పెద్దవాగు కాలువ లో గురువారం వేర్వేరు చోట్ల చిక్కుకున్న 35 మందికి పైగా రైతులు,కూలీల ను ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందం రక్షించింది. మంత్రులు తుమ్మల,పొంగులేటి ఆదేశాలతో రంగంలో కి దిగిన జిల్లా ఉన్నతిని కారులు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఎస్.పీ రోహిత్ రాజు,డీఎస్పీ సురేష్ కుమార్ లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అశ్వారావుపేట మీదుగా ఆంధ్రా వెలేరుపాడు వెళ్ళాల్సిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అనుకోని పరిస్థితుల్లో ఇక్కడే ఆగిపోయారు.వారి ప్రాంతం కు చెందిన కూలీలు చిక్కుకున్న వారిని సైతం రక్షించడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చారు.అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సైతం ఇక్కడే ఉండి తెలంగాణ హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చారు.ఎట్టకేలకు వరదలో చిక్కుకున్న నిర్వాసితులు క్షేమంగా జలగండం నుండి బయటపడ్డారు.