మీషో ఆర్డర్లలో 35 శాతం వృద్ధి

మీషో ఆర్డర్లలో 35 శాతం వృద్ధిహైదరాబాద్‌ : గతేడాది 2024 ఆర్డర్లలో 35 శాతం వృద్ధిని సాధించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ మీషో తెలిపింది. వినియోగదారుల సంఖ్యలోనూ 25 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ప్రకటించింది. దీంతో మొత్తం ఖాతాదారుల సంఖ్య 17.5 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ముఖ్యంగా చిన్న పట్టణాలకు తమ సర్వీసులను విస్తరించడం ద్వారా మెరుగైన వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. బ్యూటీ, పర్సనల్‌ కేర్‌, గృహ, కిచెన్‌ ఉత్పత్తుల విభాగం ఆర్డర్లలో 70 శాతం పెరుగుదల ఉందని తెలిపింది.