శిక్షణ కాలంలో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ అకాడమీకి చెందిన 35వ ఎఫ్ బి ఓ ట్రైనీ బ్యాచ్ బ్యాచ్ కి సంబంధించిన 33 మంది ఎఫ్ బి ఓ లు బుధవారం లక్నవరం ప్రాంతాన్ని సందర్శించారు. శిక్షణలో భాగంగా ఎనిమిది కిలోమీటర్లు టేకింగ్, క్యాపింగ్ సైట్, స్లూస్ పాయింట్ (తూముల ప్రాంతం) లో పర్యటించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈకో పార్క్ లో కొత్తరకం చెట్లను పార్కు నిర్వహణ తీరును ఈ ప్రాంతంలో కనిపిస్తున్న కొత్త మొక్కలైన తెల్ల పూనికి, నీటి కానుగా మొక్కల గురించి స్థానిక ఎఫ్ ఆర్ ఓ జే మాధవిశీతల్ క్లుప్తంగా వివరించారు. వీరితో దూలపల్లి ఎఫ్ బి ఓ ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఎం వంశీకృష్ణ, రేంజ్ సిబ్బంది ఎఫ్ఎస్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఎఫ్ బి ఓ టి దీప్ లాల్ పార్కు సిబ్బంది పాల్గొన్నారు.