నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని కుచనపల్లి గ్రామ అభివృద్ధికి రూ.36 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు అన్నారు. సోమవారం గ్రామంలో రూ 18 లక్షలతో వాటర్ ట్యాంకు రూ.18 లక్షలతో పైపులైను కోసం భూమి పూజ చేశారు. నిధుల మంజూరు పై హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ డి ఇ రుహిన , గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి రాజు, మడప యాదవ రెడ్డి, మడప పెద్దిరెడ్డి ,నీరటి సాయిలు, చెప్పాల శీను, ఇంద్రాల స్వామి, గ్రామ కార్యదర్శి రజిత.తదితరులు పాల్గొన్నారు.