
నల్గొండ జిల్లా అనుముల మండలంలోని చింతగూడెం గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అనుముల మండల అధ్యక్షుడు కాట్నం యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో చింతగూడెం గ్రామంలోని సొసైటీ సభ్యులతో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కాటమయ్య స్పూర్తితో తెలంగాణ వృత్తిలో ఉపాధికై ఉద్యమిస్తాం. నాడు నరరూప రాక్షసులను సంహరించి తాటి, ఈత వనాలను కాపాడిన కాటమయ్య స్ఫూర్తితో నేడు వన సంరక్షణకై ఉద్యమిస్తామని అన్నారు. పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 2వ తారీకు నుండి 18 వ తారీకు వరకు అమరుల యాది లో గీతన్న చైతన్య యాత్రలు అనే నినాదంతో అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో సభలు సమావేశాలు ప్రతి సంవత్సరం లాగానే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు చింతగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి నిర్వహించడం జరిగింది.తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హర్రాజు మాములాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవడం, నౌకరి నామాలాంటి చట్టాలను రద్దు చేయించడం, ఎక్స్గ్రేషియా, చె ట్ల పెంపకానికి భూమి, పెన్షన్ తదితర హక్కులు సాధించిన చరిత్ర కల్లుగీత కార్మిక సంఘానిది.దానికి నాయకత్వం వహించిన బొమ్మగాని ధర్మబిక్షం, ఎస్ ఆర్ దాట్ల, తొట్ల మల్సూర్, వైరు మల్లయ్య, వేముల నాగయ్య, దేశిని చిన్న మల్లయ్య, వర్దెల్లి బుచ్చిరాములు, పెరుమల్ల జగన్నాథం, బొలగాని పుల్లయ్య, ఘనగాని గౌరయ్య, దూడల నరసయ్య, అంబటి సత్యనారాయణ లాంటి ఎందరో అమరవీరులు ఉన్నారు.
వారిని స్మరించుకుంటూ నేటి తరానికి వారి త్యాగాలను తెలుపుతాం. మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ప్రణాళికలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా విన్నవిస్తాం అని తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ అవి ఏంటంటే వృత్తిలో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలి సేఫ్టీ మోకులు వృత్తి చేసే వారందరికీ ఉచితంగా ఇవ్వాలి. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా నెల ోజుల లోపు ఇవ్వాలి.మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలి. వృత్తిలో భాగంగా ఎక్కడ ప్రమాదం జరిగిన ఎక్స్గ్రేషియా వర్తింప చేయాలి. బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాలి. కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. కల్లుగీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 2000 రూపాయల పెన్షన్ కాకుండా, ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరములు నిండిన ప్రతి కల్లుగీత కార్మికునికి చేయూత పథకం ద్వారా నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కల్లుగీత కార్మికునికి వృత్తికి ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. రాష్ట్ర బడ్జెట్లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్ల బడ్జెట్ కేటాయించి టాడి కార్పొరేషన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రతి సొసైటీకి తాటి, ఈత, ఖర్జూర చెట్ల పెంపకానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జీవో అమలు చేయాలి.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కాసాని సత్తయ్య గౌడ్, వడ్డగోని వెంకన్న గౌడ్, కాట్నం సైదులు గౌడ్, కాట్నం నవీన్ గౌడ్, చెదురుబెల్లి రామలింగం గౌడ్, కాకునూరి సైదయ్య గౌడ్, చెదురుబెల్లి శివ గౌడ్, కాట్నం నరసింహ గౌడ్, వడ్డగోని గోవిందు గౌడ్, పల్సా సాయికుమార్ గౌడ్, కాట్నం సైదయ్య గౌడ్, కాట్నం వెంకటయ్య గౌడ్, కాట్నం రామయ్య గౌడ్, చెదురుబెల్లి వెంకయ్య గౌడ్ తదితర కల్లుగీత కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.