
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్’ కార్యక్రమాన్ని మండల ఎంపీడీ ఓ వర్కాల మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు.ఈ ఈ నెల 8 వరకు హోం ఓటింగ్ జరగనున్నది. మండలం లో వృద్ధులు, దివ్యాంగులు 186 మంది ఉన్నట్లు గుర్తించారు. శనివారం మొత్తం 38 మంది ని హోం ఓటింగ్ చేపించడం జరిగింది.38 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరోజ మరియు హోం ఓటింగ్ సిబ్బంది, మరియు పంచాయతీ కార్యదర్శులు,మరియు బూతు లెవల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.