38వ జాతీయ క్రీడలు

38th National Games – హర్ష ప్రదకు సిల్వర్‌ మెడల్‌
డెహ్రాడూన్‌ : 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ తైక్వాండో క్రీడాకారిణి పాయం హర్ష ప్రద సత్తా చాటింది. మహిళల 73 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుని సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయిపై అలవోక విజయం సాధించిన హర్ష ప్రద.. సెమీస్‌లోనూ అదే జోరు చూపించింది. ఉత్తరాఖాండ్‌ క్రీడాకారిణిపై సులువుగా గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. పసిడి పోరులో చంఢగీడ్‌ అమ్మాయికి గట్టి పోటీ ఇచ్చినా.. సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుంది. జాతీయ క్రీడల్లో రజత పతకం సాధించిన హర్ష ప్రదను శాట్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి, తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కోశాధికారి డి. సతీశ్‌ గౌడ్‌లు అభినందించారు.