398 పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని చీన్నపూర్ గ్రామంలో పశు వైద్యశాల అధ్వర్యంలో పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను పశు వైద్యులు కిరణ్ దేశ్ పాండే శుక్రవారం వేశారు. ఈ సందర్భంగా 398 పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. ప్రతి రైతు తమ పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ఉమమ సహెర్, విఎల్ఓ వినిత, విఏ అహ్మద్ పాషా, గోపాల మిత్ర సుదీర్, వ్యక్సినేటర్ జైల్ సింగ్, సిబ్బంది శ్రీను, గంగాధర్, పుష్ప, లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.