బీసీల నిప్పు కనిక దేశాలి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి

39th birth anniversary of BC's Nippu Kanika Desali Chakali Ailammaనవతెలంగాణ – కంఠేశ్వర్ 
సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వినాయక నగర్లోని హనుమాన్ జంక్షన్ లో గల వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా బిసి సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శన అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు కోవాలని బిసి సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఆ రోజు దేశ్ముఖ్ లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ యొక్క తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయం, తన నాలుగు ఎకరాల భూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమి చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ. ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించింది ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకుంటారని ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో  బుస్స ఆంజనేయులు, దర్శనం దేవందర్, కొయ్యాడ శంకర్, బాలన్న, బస్వ‌రాజ్, రమణ స్వామి, భూమేష్  తదితరులు పాల్గొన్నారు.