– అన్నారం గుత్తి కోయ గుంపులో కార్డెన్ సెర్చ్
– బంజర ఎల్లాపూర్ రోడ్డుపై వాహనాల తనిఖీ
– తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా ఇటీవల గత ఈ నెల ఫిబ్రవరి 25 శనివారం నాడు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 కే రన్ పోటీల్లో విజేతలుగా మండలానికి చెందిన బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో వెంగళాపురం గ్రామానికి చెందిన తెల్లం ప్రియాంక, బాలుర విభాగానికి చెందిన కాల్వపల్లిగ్రామానికి చెందిన కుర్సం రవి లు ప్రథమ స్థానంలో నిలిచారు. మంగళవారం స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వారి స్వగ్రామంలో శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించి, అడిడాస్ కంపెనీ షూలు ప్రధానం చేశారు. అనంతరం అన్నారం గుత్తి కోయ గుంపులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణకు గుత్తి కాయ గుంపులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయమే చేరుకొని ఇల్లు ఇల్లు తిరిగి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి వాహనాలను తనిఖీ చేశారు. ఎవరు గాని అసాంఘిక కార్యకలాపాలకు తావి వద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచార ఇవ్వాలన్నారు. ఆయన వెంట పోలీసులు ట్రైనింగ్ ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.