
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో మంగళవారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ, శివపార్వతి, గణపతి ,ఆదిత్య, నందికేశ్వర, భక్తాంజనేయ ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పెద్దపల్లి,రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, భూపాలపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడ్డురి లక్ష్మన్ కుమార్, విజయ రమణారావు, ప్రేమ్ సాగర్, మక్కాన్ సింగ్ రాకూర్,గండ్ర సత్యనారాయణ,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, అరెపల్లి మోహన్, బండ గణేష్, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, ఎంపీపీలు చింతలపల్లి మలహల్ రావు, సమ్మయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్, గడ్డం క్రాoతి, జంగిడి శ్రీనివాస్, కొండ రాజమ్మ,బడితేల రాజయ్య,కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.