అంగన్‌వాడీల సమ్మె ఏ 3వ రోజు

 3rd day of Anganwadi strikeనవతెలంగాణ-ములుగు
తమను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, తదితర డిమాండ్స్‌ పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అధ్వర్యంలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 3వ రోజు కొనసాగింది. గాంధీ విగ్రహం ముందు మూతికి నల్ల రిబ్బన్‌ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ మాట్లాడుతూ మంత్రి సత్యవతి రాథోడ్‌ అత్యంత దుర్మార్గమైన పద్ధతిని అనుసరించి పోరాటంలో లేని ప్రభుత్వ తొత్తు సంఘాలతో చర్చలు జరిపిందని ఆరోపించారు. వారి ప్రధాన డిమాండ్స్‌ ఏవీ ప్రస్తావించలేదని మండిపడ్డారు. కేవలం చనిపోయిన తర్వాత దహన సంస్కా రాలు నిర్వహించడానికి టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకూ రూ.10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం అన్నారు. ఇందులో కూడా టీచర్లకు, ఆయాలకు అమౌంట్‌ లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదన్నారు. జిఓ రాలేదని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మళ్లీ పాతవే ప్రకటించారన్నారు పోరాడే సంఘాలను చర్చలకు పిలిచి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని అన్నారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పద్మరాణి, మోక్ష రాణి, భాగ్యలక్ష్మి, రేణుక, అలివేలు, విజయ, అనసూర్య, బాణమ్మ, కల్పన, మానస, స్వరూప, రాధిక, సన, తదితరులు 50 మంది పాల్గొన్నారు.