నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన 4.8 శాతం కరువుభత్యం (డిఏ)ను మంజూరు చేసినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డిఏను సిబ్బందికి చెల్లిస్తామని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారనీ, ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని చెప్పారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమనీ, వారి సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2019 నుంచి విడతల వారీగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేశామ న్నారు. దీనితో ఉద్యోగులకు ఎలాంటి డిఏ బకాయిలు లేవని స్పష్టం చేశారు.