– గాయపడిన వారిలో
– 3 ఇంజనీర్లు, టిప్పర్ డ్రైవర్
నవతెలంగాణ-గండిపేట్
గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో వ స్తున్న కారును టిప్పర్ డీకొీట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగి పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్ నుంచి హై హౌమ్ అవతారం చౌరస్తా వద్ద గచ్చి బౌలి నుంచి అతివేగంతో వస్తున్న టిప్పర్ రాంగ్ రూట్‌లో వస్తున్న కారును డీ కొట్టింది. దాంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది.ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సతీష్ తోపాటు కారులో ఉన్న ముగ్గురు గౌతమ్, సందీప్, ఈ శ్వర్‌లు తీవ్రంగా గాయ పడ్డారు. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. క్షతగ్రాతులను స్థనిక ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారు ఇంజనీర్లుగా గుర్తిం చారు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.