– షెడ్యూల్ ప్రకటించిన
– బీసీసీఐ, సీఎస్‌ఏ
ముంబయి : టీమ్ ఇండియా 2024-25 సీజన్ స్వదేశీ సీజన్ షెడ్యూల్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ఓ విదేశీ పర్యటనను ఖరారు చేసింది. క్రికెట్ దక్షిణాఫ్రికాతో కలిసి నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు నాలుగు టీ20 మ్యాచులు ఆడనుంది. నవంబర్ 8, నవంబర్ 10, నవంబర్ 13, నవంబర్ 16న వరుసగా డర్బన్, పోర్ట్ ఎలిజబెత్, సెంచూరియన్, జొహనెస్‌బర్గ్‌లో మ్యాచులు జరుగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.