పదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400% వృద్థి

 పదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400% వృద్థివిజయవాడ : గడిచిన పదేళ్లలో భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400 శాతం వృద్థిని నమోదు చేసిందని సెల్‌కాన్‌ గ్రూపు సిఎండి వై గురు అన్నారు. ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్ల మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ రంగంలో ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ఎపి నూతన ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎపిని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకి పవర్‌హౌస్‌గా మార్చడానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఐటి హబ్‌గా మార్చడానికి, అభివృద్థి చేయడానికి సిద్దంగా ఉన్నామని నారా లోకేష్‌ పేర్కొన్నట్లు తెలిపారు.