ఎంపీ టికెట్ల కోసం 41 దరఖాస్తులు

– డిప్యూటీ సీఎం భార్య మల్లు నందిని కూడా…
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం ఆరు దరఖాస్తులు వస్తే, బుధవారం మాత్రం ఏకంగా 35 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు 9, నాగర్‌క ర్నూల్‌కు 8, భువనగిరికి 6, ఖమ్మం 2, నిజామా బాద్‌కు మూడు చొప్పున అందాయి. ఖమ్మం కోసం మాజీ ఎంపీ వి. హనుమంతరావు, భువనగిరి నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చలగాని దయాకర్‌గౌడ్‌, నిజామాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతోపాటు కె నగేష్‌, మంద జగన్నాథం దరఖాస్తులు చేసుకున్నారు.
కాంగ్రెస్‌ గూటికి విద్యాస్రవంతి
ఉస్మానియా యూనివిర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యాస్రవంతి కాంగ్రెస్‌ గూటికి చేరుకోనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.