ఆ కేసులకు 41 సీఆర్‌పీసీ వర్తింపజేేయొద్దు

– జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌కు డీబీఎఫ్‌ విన్నపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్డం 1989, సవరణల చట్టం (2015) కింద నమోదైన కేసులకు 41 సీఆర్‌పీసీని వర్తింప చేయొద్దని దళిత బహుజన ఫ్రంట్‌(డీబీఎఫ్‌) వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినరు కుమార్‌, ప్రధాన కార్యదర్శి పి శంకర్‌, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ అంతర్‌సింగ్‌ ఆర్యకు వినతిపత్రాన్ని అందజేశారు. లైంగిక దాడులకు, దాడులకు పాల్పడు తున్న నిందితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వొద్దని వారు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీలపై దాడులు పెరిగి పోతున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని కోరారు. ఫిబ్రవరి రెండో వారంలో పర్యటిస్తానని కమిషన్‌ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తున్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.