లోక్ అదాలత్ లో 4121 కేసులు పరిష్కారం

4121 cases solved in Lok Adalatనవతెలంగాణ-సంగారెడ్డి
జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి.రమేష్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవాని చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మాట్లాడుతూ రాజీమార్గమే రాజా మార్గమని సత్వర న్యాయం సమన్యాయం అందుతుందని సివిల్ తగాదాలు కుటుంబసగాదాలలో ఉన్న ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకొని భవిష్యత్తులో ఎలాంటి తగవులు రాకుండా ఈ లోక అదాల ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని అని అన్నారు.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది బెంచీలను అందులో సంగారెడ్డి జిల్లా కోర్టు నందు ఐదు బెంచీలు జహీరాబాద్ కోర్టు నందు రెండు బెంచీలు జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులను ఒక్కొక్క బెంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కే. జయంతి మాట్లాడుతూ కక్షిదారులు వారి యొక్క న్యాయవాదులతో కలిసి ఈ కుటుంబ తగాదాలు సివిల్ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందాలని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామన్నారు. పరిష్కరించబడిన కేసుల వివరాలు, నష్టపరిహారం ఈ క్రింద విధంగా ఉన్నాయి సివిల్ తగాదాలు 52, ఎంవిఓపి కేసులు 29 నష్టపరిహారం= 1,76,35,000/- , క్రిమినల్ కాంపౌండ్ కేసులు 3526, బ్యాంకు రికవరీ కేసులో 246, రికవరీ మొత్తం=1,45,32,337/-,. ఎన్ ఐ యాక్ట్ కేసులు 01, సైబర్ సైబర్ క్రైమ్ కేసులు 50, ప్రిలిటిగేషన్ కేసులు 05, విద్యుత్ చౌర్యం ప్రీలిటిగేషన్ కేసులు 212, మొత్తం కేసు
లు 41 21 కేసులు, మొత్తం అమౌంట్=32167337/-. . ఈ జాతీయ లోక్ అదాలత్ లో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ కృష్ణ అర్జున్, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి లావణ్య బాల్రెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం. రాధాకృష్ణ చౌహన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మణాచారి, మొదటి అదనపు ప్రథమ శ్రేణి, జడ్జ్ షాలిని, స్పెషల్ ఎక్సైజ్ కోర్ట్ జడ్జ్ తేజశ్రీ, బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, గవర్నమెంట్ ప్లీడరు ప్రభు దాన్యం, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ అధికారులు బ్యాంక్ అధికారులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుల్స్, కక్షిదారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.