కాంగ్రెస్ పార్టీ 420 కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడాలని ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సచివాలయ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు పరచాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటికీ కాంగ్రెస్ పాలనలోనికి వచ్చి 420 పూర్తయిందని, వెంటనే వారు ప్రకటించిన 420 (చార్ సౌ బీస్) హామీలు వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ యావత్తు ప్రజానీకాన్ని మాయమాటలతో తీర్చలేని హామీలను ఇచ్చి అధికారంలోనికి వచ్చారని మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో తెలంగాణ పార్టీకి తెలుసు అని ఎద్దేవా చేశారు. రానున్న ప్రాదేశిక గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్య గెలువ లేమోనని 26వ తేదీన అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని మాయమాటలు చెప్పిన, ఇప్పటివరకు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీని నెరవేర్చలేని నిరంకుషత్వ పాలన కాంగ్రెస్ పార్టీదీ అన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ లాల్ మొహమ్మద్, మాజీ సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, నాయకులు బేర మధుకర్, శాతబోయిన రమేష్, లక్క శ్రీనివాస్, బేరా హరీష్,నాగబెల్లి విజయ్ కుమార్, మాచర్ల సుదర్శన్,మాజీ ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.