వందేమాతరంలో 42వ వార్షికోత్సవ వేడుకలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని వందేమాతరం ఉన్నత పాఠశాల 42వ వార్షికోత్సవంను పాఠశాల యాజమాన్యం ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథులుగా అమెరికా నుండి వచ్చిన క్యాన్సర్ డాక్టర్ ఎన్ఆర్ఎ మెడికల్ కాలేజీ అండ్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతు మండల కేంద్రంలో 42 ఎళ్ళ క్రీతం ఇంగ్లిష్ పాఠశాలను ప్రారంభించి ఎందారో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తిర్చిదిద్దిన ఘనత వందేమాతరం పాఠశాలకేదక్కిందన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్ధులు డాక్టర్లు ఇంజనీర్లు గా ఎదిగారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నా యన్నారు.అనంతరం ఉపాధ్యయులను,పూర్వవిద్యార్ధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్మ జిల్లా అద్యక్షులు ఎస్.జయసింహాగౌడ్,మండలవిద్యాధికారి పి.రాజాగంగారాం, కరస్పాండెంట్ మాథ్యూస్, ప్రిన్సిపాల్ విక్రాంత్, అధ్యాపక బృందం, పూర్వ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.