గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు రూ.437.0 కోట్లు 

437.0 crores for pending works of Gauravelli project– క్యాబినెట్ నిర్ణయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం  
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.437.0 కోట్లు విడుదలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హుస్నాబాద్ రైతాంగ చిరకాల స్వప్నం నెరవేరడం కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్ష వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కోసం క్యాబినెట్లో బడ్జెట్ కేటాయించడానికి కృషిచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.