దేశంలో 44 శాతం మంది ఎమ్మెల్యేలు నేరచరితులే!

బీజేపీ వారే ఎక్కువ : ఏడీఆర్‌ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ రాష్ట్రాలలో 4,001 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 1,777 మంది ఎమ్మెల్యేలు…అంటే 44% మంది నేరచరితులే. వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. ప్రజాస్వామ్య హక్కుల సంస్థ (ఏడీఆర్‌) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. 479 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉండగా 334 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు, 99 మంది డీఎంకే సభ్యులపై కేసులు ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్న ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన వారు 337 మంది, కాంగ్రెస్‌ సభ్యులు 194 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు 77 మంది ఉన్నారు. తీవ్రమైన కేసులు అంటే నాన్‌-బెయిలబుల్‌ కేసులు. నేరం రుజువైతే గరిష్టంగా ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. వేధింపులు, హత్య, కిడ్నాప్‌, లైంగిక దాడి, మహిళలపై నేరాలు, అవినీతి కేసులు వంటివి ఈ నేరాల కోవలోకి వస్తాయి.
క్రిమినల్‌ కేసులలో చిక్కుకున్న ఎమ్మెల్యేలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువ. యూపీకి చెందిన వారు 202 మంది, మహారాష్ట్రకు చెందిన వారు 175 మంది, బీహార్‌కు చెందిన 161 మంది ఈ తరహా కేసులలో నిందితులుగా ఉన్నారు. ఆస్తిపాస్తులకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలకు… కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌, ప్రియకృష్ణ, స్వతంత్ర సభ్యుడు కేహెచ్‌ పుట్టస్వామి గౌడ… వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. బీజేపీకి చెందిన నిర్మల్‌ కుమార్‌ ధారా ఆస్తి విలువ కేవలం రూ.1,700 మాత్రమేనట!. స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదులి ఆస్తి విలువ రూ.15 వేలు, ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేంద్ర పాల్‌ సింగ్‌ సావ్నా ఆస్తి విలువ రూ.18,370గా
దేశంలో 44శాతం మంది ప్రకటించారు. వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌కు చెందిన వారు 33 మంది, బీజేపీకి చెందిన వారు 24 మంది, వైసీపీకి చెందిన వారు 8 మంది ఉన్నారు. దేశంలోని ఎమ్మెల్యేలలో కేవలం 9% మంది (378) మాత్రమే మహిళలు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 48 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా పశ్చిమ బెంగాల్‌లో 41 మంది, బీహార్‌లో 18 మంది ఉన్నారు. మిజోరంలోని మొత్తం 40 మంది శాసనసభ్యులూ పురుషులే.