రబీలో 98, యాసంగిలో 44 శాతం సిఎంఆర్ లక్ష్యం పూర్తి

98, 44 percent CMR target is complete in Yasangi– 100%  పూర్తి చేయడం కోసం అధికారుల ప్రయత్నాలు…
– నవంబర్ 30 వరకు పొడిగింపు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కస్టమ్స్ బిల్డింగ్ రైస్ (సిఎంఆర్ ) మిలలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించడంలో వెనుకబడిపోయారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లో కొన్న దానిని ప్రభుత్వం జిల్లాలోని మిల్లర్లకు కేటాయించారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఇచ్చేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ చివరి వరకు గడివిధించింది. కాగా అక్టోబర్ చివరి నాటికి లక్ష్యం పూర్తి కాకపోవడంతో నవంబర్ 30కి డేటు పొడిగించినట్టు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
 అందుకోసం అధికారులు మిల్లర్లపై తనిఖీలు చేపట్టి వెనుకంజు వేశారు. త్వరగా సిఎంఆర్ లక్ష్యాన్ని  పూర్తిచేసేలా అధికారులు మిల్లర్లపై ఒత్తిడి చేస్తున్నారు. వాన కాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 98 శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. వర్షాకాలం సీజన్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,65, 197 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, మిల్లర్లు ప్రభుత్వానికి 1,80,204  మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 1,77,309  మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 2895 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. మీగత 2 శాతం ఈనెల ఆఖరిలోపు కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.
యాసంగి సీజన్…
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాక్షన్ సింగ్ సీజన్ కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా 44 శాతం  మాత్రమే సీఎంఆర్ ను ప్రభుత్వానికి ఇచ్చారు. మిగతా 56 శాతం ధాన్యం ను ఇవ్వాల్సి ఉంది . యాసంగి సీజన్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,70, 635 మెట్రిక్  టన్నుల ధాన్యమును ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చింది. మిల్లర్లు సిఎంఆర్ రైసును 1, 81 వేల 325 మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 79,622 మెట్రిక్  టన్నుల సిఎంఆర్ బియ్యం  మాత్రమే అందజేశారు. ఇంకా  ఒక లక్ష 17 వందల 3  మెట్రిట్టనుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఇంకా లక్ష 1, 17 వందల మెట్రిక్ టన్నుల  పై చిలుకు  సిఎంఆర్  ప్రభుత్వానికి బకాయి ఉండడంతో అక్టోబర్ 31వ తేదీ గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. కాగా మిల్లులో దాన్నే ఉందా లేదా అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ,  సీఎంఆర్ ప్రభుత్వానికి తిరిగిపించడంలో అధికారుల అలసత్వం పై ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలు చేపట్టిన అధికారులు…
ఇల్లులో దానే ఉందా లేదా అని తెలుసుకునేందుకు భారత ఆహార సంస్థ అధికారుల అక్టోబర్ ఆరవ తేదీన తనిఖీలు చేపట్టారు. ఒక రోజు పాలు మిల్లులలో తనిఖీలు చేసి మధ్యలోనే నిలిపివేశారు. మధ్యలోనే ఎందుకు నిలిపివేశారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రైస్ మిల్లులు మాత్రమే 100% ప్రభుత్వ లక్ష్యాన్ని చేరాయి. 
36 రైస్ మిల్లులకు గాను రబీ సీజన్లో  రెండు రైస్ మిల్లు మాత్రమే 100% సీఎంఆర్ ను ప్రభుత్వానికి అందజేశాయి. మిగతా 34 రైస్ మిల్లులు తమ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది.
సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం: జిల్లా పౌరసరఫరాల సంస్థ  మేనేజర్ జగదీష్ కుమార్
ప్రభుత్వ నిబంధనల మేరకు రైసును ప్రభుత్వానికి ఇవ్వని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జగదీష్ కుమార్ తెలిపారు.
సిఎంఆర్ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా మిల్లర్లు ముందంజలో ఉన్నారని, గడులోగా చెల్లించేలా ఒత్తిడి తెస్తున్నామని అన్నారు.